గ్రూప్-2 పోస్టులకు భారీగా దరఖాస్తులు
ఆంధ్రప్రదేశ్లో గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 720 పోస్టులు ఉండగా, వీటిలో 471 ఎగ్జిక్యూటివ్, 249 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-3, డిప్యూటీ తహసీల్దార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్, ఎక్సైజ్ ఎస్ఐ తదితర పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ psc.ap.gov.in ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.