తిరుపతి జిల్లాకు భారీ పరిశ్రమలు.. రూ.4 వేల కోట్ల పెట్టుబడులు!

అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో నాయుడుపేటలో భారీ పరిశ్రమల ఏర్పాటుపై చర్చ జరిగింది. లిథియం బ్యాటరీ మెటీరియల్ తయారీ పరిశ్రమతో పాటు రూ.4 వేల కోట్ల పెట్టుబడితో కార్బన్ కార్బ్స్ సంస్థ పరిశ్రమ ఏర్పాటుపై చర్చించినట్లు సమాచారం. ఈ పరిశ్రమలు ఏర్పాటైతే స్థానిక యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.