ప్రభుత్వ అధికారుల వాహనాలకు ఇక EVలకే ప్రాధాన్యం
కేంద్ర ప్రభుత్వ అధికారులు కొత్తగా వాహనాలు కొనుగోలు చేసే సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలకే (EV) తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ఆర్థికశాఖ ఆదేశించింది. ఎలక్ట్రిక్ కార్ల గరిష్ఠ ధర పరిమితిని రూ.20 లక్షలకు పెంచింది. అద్దె వాహనాల విషయంలోనూ ఈ నిబంధనలు పాటించాలని సూచించింది. ఇంధన వినియోగాన్ని తగ్గించి, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.